మా నాలుగేళ్ళ చిన్నరి మనీష ను సంగీతం క్ల్లాసులొ ఆరోజె చేర్పించాను.క్లాసు అయిన తర్వాత ఇంటికి వచ్చిన మనీష ను అడిగాను “ఈరోజు పాఠం ఏమి చెప్పారు” అని. “ఈరోజు “ఆది”తాళం నేర్పించారు నాన్న అంది. మరి రేపు ఏం చెపుతారు అని అడిగాను. ఏముంది నాన్న రేపు “సోమ”తాళం, ఎల్లుండి “మంగళ”తాళం అంటు వారాల తాళాలు చెప్పెటప్పటికి అందరము తెగ నవ్వేశాము.దాని సమయస్పూర్తికి ఇంట్లొ అందరము ఎంతో ఆనందించాము.—-Kalamraju Srinivasa Rao